కల్కి 2898 AD : మొదటిరోజు నైజాంను షేక్ చేసిన "కల్కి".. టోటల్ ఇదే..?

Pulgam Srinivas
చాలా రోజులుగా ఎంతో మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న కల్కి సినిమా నిన్న భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా , కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. దిశా పటాని ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించగా , బ్రహ్మానందం , శోభన , మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇక విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.

వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో ఏకంగా 19.55 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ మూవీ కి నైజాం ఏరియాలో దాదాపుగా 70 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీ దాదాపుగా 20 కోట్ల మేర షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ మరో 50 కోట్ల షేర్ కలెక్షన్లను నైజాం ఏరియాలో రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని ఈ ఏరియాలో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ను బట్టి చూస్తే ఈ మూవీ చాలా ఈజీగానే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: