కల్కి కోసం రెమ్యూనరేషన్ తగ్గించేసిన డార్లింగ్.. ఎందుకంటే..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చింది. కలియుగంతానికి మహాభారతానికి లింక్ చేస్తు అడ్వాన్స్ టెక్నాలజీ తో అదిరిపోయే విజువల్స్ వెస్తులు ఊహించిన విధంగా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ అమితాబచ్చన్ల మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేసిన అన్ని సినిమాల్లో

 ఇది బెస్ట్ సినిమా అని అంటున్నారు డార్లింగ్ అభిమానులు. ఇక నాగ్ అశ్విన్ టేకింగ్ విజువల్ వండరింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కేవలం ఒక్క రోజులోనే 180 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన రోజుకు ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వస్తు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న వార్తలు పెద్ద ఎత్తున వినబడుతుంది. ఐతే ఈ సినిమా కు ప్రభాస్

 అత్యధికంగా రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నాడని ముందు నుంచి వినిపిస్తున్న టాక్. అయితే తాజా నివేదికల ప్రకారం నిజానికి కల్కి 2898 ఏడి కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట కల్కి కోసం ప్రభాస్ కేవలం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నాడని సమాచారం. అయితే డార్లింగ్ పారితోషికం తగ్గించుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అయితే బడ్జెట్ కోసమే ప్రభాస్ ఇలా తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడని అంటున్నారు. మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2025లో విడుదల కానున్న రాజాసాబ్ కు కూడా తక్కువే పారితోషికం తీసుకుంటున్నాడట. నిజానికి ఈ కు అసలు పారితోషికం తీసుకోవడం లేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: