కల్కి 2898 AD : ఆంధ్రలో అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయిన "కల్కి".. మొత్తం ఎంత వచ్చిందంటే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... దిశ పటానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ చిన్న చిన్న క్యమియో పాత్రలలో నటించారు. ఇకపోతే నిన్న విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ ప్రపంచ వ్యాప్తంగా లభించింది. అలాగే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు సీడెడ్ ఏరియాలో 5.10 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కగా , ఉత్తరాంధ్రలో 5.38 కోట్లు , ఈస్ట్ లో 3.95 కోట్లు , వెస్ట్ 2.85 కోట్లు , గుంటూరు లో 3.25 కోట్లు , కృష్ణ లో 2.80 కోట్లు , నెల్లూరులో 1.46 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూవీ కి మొదటి రోజు 24.79 కోట్ల షేర్ కలక్షన్ వచ్చాయి. ఇక ఈ మూవీ మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలీలగా 30 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను రాబడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ విషయంలో కల్కి మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఈ మూవీ కి మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రెండవ రోజు నుండి ఈ సినిమాకు కలెక్షన్ లు అదిరిపోయే రేంజ్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: