సుధీర్ కెరీర్ లోనే హరోం హర హైయెస్ట్... నయా తలపతి రేర్ ఫీట్..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు సుదీర్ బాబు తాజాగా హరోం హర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జూన్ 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే పరవాలేదు అనే టాక్ ను తెచ్చుకుంది.
 

దానితో ఈ సినిమాకి మొదటి రోజు భారీ మొత్తంలో కలెక్షన్ లు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ను విడుదల చేసింది. దాని ప్రకారం హరోం హర మూవీ మొదటి రోజు ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సుధీర్ బాబు కెరియర్ లో తెచ్చుకున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను ఈ చిత్ర బృందం వారు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి సుదీర్ బాబు కెరియర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ గా నిలిచిన ఈ మూవీ లాంగ్ రన్ లో ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుంది అనేది చూడాలి. ఈ సినిమాలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించ‌గా సునీల్ , ర‌వి కాలె , కేశ‌వ్ దీప‌క్ , జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ మూవీ కి సంగీతం అందించ‌గా ... శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుమంత్ జి నాయుడు ఈ సినిమాని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb

సంబంధిత వార్తలు: