పాపం.. అక్కడ కూడా చంద్రబాబుకు నిరాశే ?

Chakravarthi Kalyan
ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పలు కోర్టుల్లో పలు రకాల కేసులు వేయించారు చంద్రబాబు.. కానీ ఒక్కదాంట్లో కూడా ఆయన అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. 


తాజాగా వివిపాట్ స్లిప్ లను ముందుగా లెక్కించాలన్న న్యాయవాది బాలాజీ వేసిన పిటిషన్ ను  హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు గంటల సేపు విచారించింది. ఆ తర్వాత హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. 

ఏదో ఒక రకంగా ఈ వీఎంలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో పలు స్కీములు ప్రయత్నించింది. ఏదో ఒక లిటిగేషన్ పెట్టి దాని ఆధారంగా ఫలితాల విషయంలో గందరగోళం సృష్టించేందుకు పక్కా ప్లాన్ ఉందట. అందుకే వివిపాట్ లు ఏభై శాతం లెక్కించాలని, వంద శాతం లెక్కించాలని అంటున్నారు చంద్రబాబు. 

ఈవిఎమ్ లకు, వివిపాట్ లకు తేడా వస్తే మొత్తం లెక్కించాలని, ఇలా రకకరకాల లిటిగేషన్ లు పెట్టే ప్రయత్నం చేసిన టిడిపి చివరికి ఈ ప్రయత్నం చేసింది. మరి ఇది ఎంతవరకూ ఫలితాన్నిస్తుందో మే 23 న కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: