జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!

Prathap Kaluva

ఎన్నికలు ఇక పట్టుమని నెలరోజులు కూడా లేకపోయేసరికి రెండు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే జగన్ భహిరంగ సభలతో దూసుకుపోతున్నాడు. అదే మాదిరిగా చంద్ర బాబు కూడా తన దైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. అయితే  జగన్ కు సాయంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. ముందుగా వైఎస్ జగన్ సోదరి షర్మిళ.. ఈ నెల 27 నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు.


ఇచ్ఛాపురం వరకు 50 నియోజకవర్గాల్లో షర్మిల ప్రచారం - రోడ్ షో కొనసాగనుంది. ఇక జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా రూట్ మ్యాప్ ను పార్టీ ఇప్పటికే సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ప్రచార వాహనాలను రెడీ చేసేసింది. ఎన్నికల ప్రచారం విషయంలో బాబుతో పోలిస్తే జగన్ మాంచి స్పీడ్గా ఉన్నాడు.కానీ చంద్రబాబు మాత్రం  ఎక్కడికి వెళ్లినా సోలోగానే ప్రచారం చేస్తున్నాడు.


ఈ విషయంలో చంద్రబాబుకు తన కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న సహకారం శూన్యం అనే చెప్పాలి. కొడుకు లోకేష్ ఉన్నాడంటే.. ప్రస్తుతం మంగళగిరిలో ప్రచారంలోనే బిజీగా ఉన్నాడు.  ఒకవేళ రాష్ట్రమంతా తిప్పినా లోకేష్ వల్ల చంద్రబాబుకి తలనొప్పులే తప్ప ఇంకేం ఉండవు. ఇక బాలయ్య సంగతి కొత్తగా చెప్పేదేముంది. తెలంగాణ ఎన్నికల్లోనే ఆయన ప్రచారం చూశాం. బుల్ బుల్ అం టూ కామెడీ చేసి తెలుగుదేశం పరాజయానికి తనవంతు సాయం చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: