పోలవరంలో అక్రమాలు నిజమే..నిర్ధారించిన కేంద్రం

Vijaya

పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనంటూ కేంద్రప్రభుత్వం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టల పేమెంట్లలో కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపుల్లో అవినీతి జరిగిన మాట వాస్తవమేనంటూ కేంద్రమే అధికారిక ముద్ర వేసింది. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి రాజ్యసభలో వేసిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభలో సమాధానమిస్తూ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం భారీ ఎత్తున చేసిన చెల్లింపులను తిరిగి రాబట్టాలని పిపిపి సూచించిన విషయాన్ని కూడా కేంద్రమంత్రి గుర్తు చేశారు.

 

 పోలవరంలో అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షాలు ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో పాటు పోలవరం అథారిటీ కూడా గతంలోనే నిర్ధారించింది. అయితే, ఏ సంస్ధ ఎంత చెప్పినా, ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకున్నా చంద్రబాబు ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అదే విషయాన్ని కేంద్రమంత్రి సమాధానమిస్తూ, పనులను త్వరగా పూర్తి చేయించేందుకే భూ సేకరణ, స్టీలు కొనుగోలు, ఎర్త్ వర్కు తదితరాల్లో అధిక చెల్లింపులు చేసినట్లు తమకు రాష్ట్రప్రభుత్వం చెప్పిందని తర్వాత రికవరీ చేసినట్లు లిఖిత పూర్వకంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

  

మొత్తానికి పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన విషయం కేంద్రం దృష్టిలో కూడా ఉన్న విషయం అర్ధమైపోయింది. ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు అడ్డుగోలుగా అధికార పార్టీ తన మద్దతుదారులకు కట్టబెట్టేసింది. ప్రాజెక్టులో టేకప్ చేయాల్సిన పనులన్నింటినీ ప్రభుత్వం నామినేషన్ మీదే ఇచ్చేస్తోంది. ఇదే కాకుండా పట్టిసీమ ప్రాజెక్టు పనులు కూడా అంతా టిడిపి మద్దతుదారులకు, ఫైనాన్షియర్లకే కట్టబెట్టేసింది. అందులో ఎన్ని నియమాలను ఉల్లంఘించినా కేంద్రం కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. చివరకు పనుల నాణ్యతలో కూడా చాలా చోట్ల నాసిరకమే కనబడుతోంది. మొత్తానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు పాలకులకు కల్పతరువుగా మారిపోయిందనటంలో సందేహమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: