హంగ్ వస్తే.. కాంగ్రెస్ అండతో హరీశ్ రావు సీఎం ..?

Chakravarthi Kalyan

రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. టైమ్ కలసిసొస్తే కర్ణాటకలో కుమార స్వామిలా ఎవరైనా సీఎం కావచ్చు.. కాకపోతే.. అలాంటి సిట్యుయేషన్ రావాలి. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ - ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగిన నేపథ్యంలో హంగ్ వస్తే పరిస్థతి ఎలా ఉంటుందన్న ఊహాగానాలు ఊపిరిపోసుకుంటున్నాయి.



ఎంఐఎంకూ ఎలాగూ ఆరు ఏడు సీట్లు ఖాయం. ఈసారి బీజేపీ కూడా 7 నుంచి 8 సీట్లు గెలుచుకుంటుందని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. వీరికి తోడు ఇండిపెండెంట్లు ఓ పది మంది వరకూ గెలుస్తారని ఆయన విశ్లేషించారు. అంటే మొత్తం 119లో 25 సీట్లు వరకూ పోతే.. మిగిలినవి.. 94 సీట్లు. వీటిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరాటం జరిగి కాంగ్రెస్ కు ఓ 50, టీఆర్‌ఎస్ కు 45 వరకూ సీట్లు వస్తే అప్పుడు రాజకీయం రసకందాయంలో పడుతుంది.



టీఆర్‌ఎస్ చేయూతనిచ్చేందుకు ఎంఐఎం, బీజేపీ రెండు సుముఖంగానే ఉన్నా.. ఈ రెండూ ఒకేసారి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎంఐఎం ఉంటే.. బీజేపీ ఉండదు. బీజేపీ సపోర్ట్ చేస్తే ఎంఐఎం కలసి రాదు. ఈ పరిస్థితే వస్తే.. అటు టీఆర్ఎస్ నుంచి ఒక వర్గం కాంగ్రెస్ కు గానీ... కాంగ్రెస్ నుంచి ఓ వర్గం టీఆర్ఎస్ కు గానీ మద్దతు ఇచ్చే ఛాన్సు లేకపోలేదు.



టీఆర్‌ఎస్ లో హరీశ్ రావు కొన్నాళ్లుగా అసంతప్తిగా ఉన్నారని వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్.. ఆయనకు సీఎం సీటు ఆఫర్ చేస్తే 10, 15 మంది ఎమ్మెల్యేలతో హరీశ్ రావు టీఆర్ఎస్ ను చీల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నది మరో వాదన. ఏ రాజకీయ నాయకుడికైనా సీఎం కుర్చీ అల్టిమేట్ గోల్. టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నంత కాలం తాను సీఎం కాలేడన్న సంగతి ఆయనకూ తెలుసు.

హంగ్ పరిస్థితే వస్తే.. ఎలాగైనా టీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు ఇలాంటి ఎత్తుగడలకు కాంగ్రెస్ కూడా సుముఖంగానే ఉండొచ్చు. హంగే వస్తే తెలంగాణలో అసలు సిసలైన పొలిటికల్ డ్రామా నడుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: