చేయూత, కాపునేస్తం నగదు నిజంగా పెంచారా.. జగన్ మాటల వెనుక మర్మమిదే!

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ చేయూత నగదును 75 వేల రూపాయల నుంచి 1,50,000 రూపాయలకు పెంచామని వైఎస్సార్ కాపునేస్తం నగదును 60 వేల రూపాయల నుంచి 1,20,000 రూపాయలకు పెంచామని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటల వెనుక అర్థం, పరమార్థం వేరే ఉంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపునేస్తం నగదును నిజంగానే పెంచారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తుంది.
 
జగన్ ఇప్పటికే పొందిన మొత్తాన్ని కలిపి ఆ లెక్క చెప్పారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ స్కీమ్స్ బెనిఫిట్స్ పొందిన వాళ్లు మరో నాలుగేళ్ల పాటు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. జగన్ మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నాలుగు విడతలలో ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. ఈ విధంగా ఈ స్కీమ్ లబ్ధిదారులకు బెనిఫిట్ కలగనుంది.
 
జగన్ క్లియర్ గా ఈ విషయాలను చెప్పి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సున్నావడ్డీ రుణాలకు సైతం 3 లక్షల రూపాయల లిమిట్ విధించడం గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ స్కీమ్ ను అమలు చేసి ఉంటే బాగుండేది. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఈ మేనిఫెస్టో ద్వారా సులువుగానే అర్థమవుతోంది.
 
గ్రౌండ్ రియాల్టీ తెలుసు కాబట్టే జగన్ ప్రజలకు ఏం చేయాలనుకున్నారో ఆ హామీలను మాత్రమే ప్రకటించారు. జగన్ హామీలను నమ్మకపోతే ప్రజలే అంతిమంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ మాత్రం వాస్తవాలను మాత్రమే వెల్లడిస్తూ ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలలో ఏ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతారో చూడాలి. టీడీపీ తుది మేనిఫెస్టోలో ఎలాంటి సంచలన హామీలు ఉండబోతున్నాయో చూడాలి. జనసేన కూడా కొన్ని హామీలను ప్రకటించే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: