తమన్నా ఆ తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విషయం మీకు తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీమణులు కొన్ని సందర్భాలలో కథ నచ్చక లేక ఆ సినిమాకు తేదీలు అడ్జస్ట్ చేయలేక కొన్ని మూవీలను వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా వదులుకున్న సినిమాలలో కొన్ని మూవీలు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని ఫ్లాప్ మూవీ లుగా నిలిచిపోతాయి. ఫ్లాప్ మూవీ లుగా నిలిచిపోయిన సందర్భాలలో ఆ సినిమా చేయకపోవడం మంచిదే అయ్యింది అనుకుంటారు. అదే సినిమా బ్లాక్ బస్టర్ కనుక అయినట్లు అయితే ఆ సినిమా ఒప్పుకుంటే బాగుండేమో అని కచ్చితంగా అనుకుంటారు.

ఇకపోతే తెలుగు తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనలలో ఒకరు అయినటువంటి తమన్నా కూడా తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకుంది. ఆ వదులుకున్న సినిమాలలో ఒకటి తుపాకీ. విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా మురుగదాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కాజల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు కూడా తమిళ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి మురగదాస్ మొదట ఈ సినిమాలో కాజల్ ను కాకుండా తమన్నా ను హీరోయిన్ గా తీసుకోవాలి అని అనుకున్నాడట.

అందులో భాగంగా ఈమెను సంప్రదించి కథ మొత్తాన్ని కూడా వివరించాడట. స్టోరీ మొత్తం విన్న తమన్నా సూపర్ గా ఉంది. కాకపోతే మీరు చెప్పిన టైం లో నేను ఇతర మూవీలకు కమిట్ అయి ఉన్నాను. అందువల్ల నేను ఈ సినిమాలకు డేట్లు ఇవ్వలేను అని చెప్పిందట. దానితో ఏమీ చేయలేని మురుగదాస్ ఆ తర్వాత కాజల్ కి ఈ మూవీ కథను వినిపించడం ఆమె ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆ తర్వాత ఈ మూవీ తుపాకీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: