రష్మిక బాలీవుడ్ ను ఏలానుందా..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన కన్నడ సినిమా అయినటువంటి కీరీక్ పార్టీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమ వైపు ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె నటించిన ఛలో , గీత గోవిందం మూవీ లు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంతో ఒక్క సారిగా ఈ బ్యూటీ కి తెలుగు లో సూపర్ క్రేజ్ లభించింది.

ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కడం అందులో చాలా వరకు విజాయలను సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తెలుగు లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ పుష్ప అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.  పుష్ప హిందీ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా హిందీ నట రష్మిక కి అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇక అది మొదలు ఈమెకు హిందీ లో అవకాశాలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితమే ఈమె యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ హిందీ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి మరిన్ని హిందీ అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ రూపొందుతున్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. అలాగే మరికొన్ని రోజుల్లోనే ఈమె పుష్ప 2 మూవీ తో కూడా హిందీ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ఈమె పుష్ప 2 , సికిందర్ మూవీలలో విజయాలను అందుకున్నట్లు అయితే ఈమె బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: