NTV నుంచి జర్నలిస్ట్ కొమ్మినేని ఔట్..! బాబే కారణమా..?

Chakravarthi Kalyan
అనుకున్నంతా అయ్యింది.. ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును బయటకు పంపేసింది. వాస్తవానికి ఈ ప్రక్రియ కొన్ని నెలల క్రితమే జరిగినా.. ఇప్పుడు కొమ్మినేని ఉద్వాసన ఖాయం అయ్యింది. మీడియాలో ఇలాంటి పరిణామాలు సహజమే అయినా.. పార్టీ అధినేతల ఒత్తిడి కారణంగా ఓ సీనియర్ జర్నలిస్టు ఉద్యోగం పోవడం అన్నది ఇటీవలి కాలంలో ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు. 

కేఎస్ ఆర్ లైవ్ షో ద్వారా సమకాలీన రాజకీయాలపై ప్రతి రోజూ ఉదయం ఎన్టీవీలో కొమ్మినేని నిర్వహించే లైవ్ షో కు వీక్షకాదరణ ఎక్కువగా ఉండేది. ఈ లైవ్ షోలో కొమ్మినేని కావాలనే అధికార పార్టీని ఇరుకునపెడుతున్నారని.. ప్రతిపక్ష వైసీపీకి అండగా నిలుస్తున్నారని టీడీపీ నేతలు తమ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఒకసారి ఎన్టీవీపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించిన బాబు మరోసారి ఆగ్రహించినట్టున్నారు. 

కొమ్మినేని తదుపరి ప్రస్తానం ఎటు..?



దాంతో ఎన్టీవీ కేఎస్ ఆర్ లైవ్ షోను ఆపేసింది. ఆ సమయంలో వివరణ ఇచ్చిన కొమ్మినేని.. ఇది తాత్కాలికమేనని తెలిపారు. మళ్లీ ఎన్టీవీలో చేరతానని అన్నారు. కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఆయన ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.  తాజాగా ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ఇంతకాలం ఎన్.టి.విలో ఛీఫ్ ఎడిటర్ గా, గౌరవ ఛీఫ్ ఎడిటర్ గా బాద్యతలు నిర్వహించిన నేను సంస్థ నుంచి వైదొలిగానని తెలిపారు. 

కె ఎస్ ఆర్ లైవ్ షో విరమించడానికి కారణాలను ఇంతకుముందే వివరించానని... దురదృష్టవశాత్తు ప్రభువులలో ప్రజాస్వామ్య స్పూర్తి కొరవడిందని భిన్నాభిప్రాయాలకు అవకాశం లేని విదంగా పరిస్థితులు ఏర్పడిందని వాపోయారు. మరి కొంతకాలం వేచి చూడాలని అనుకున్నప్పట్టికీ జరిగిన కొన్ని పరిణామాలలో ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి బయటకు వచ్చేశానన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: