అమరావతి : చంద్రబాబు, పవన్ సన్నిహితుడిపై చీటింగ్ కేసు

Vijaya



లింగమనేని రమేష్.. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ ఇద్దరికీ అత్యంత సన్నిహితుడు. వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా పేరున్న బిల్డర్ గా లింగమనేని బాగా పాపులర్. కరకట్టమీద చంద్రబాబునాయుడు నివాసముంటున్న అక్రమ నిర్మాణం లింగమనేనిదే. అలాగే చంద్రబాబు-పవన్ మధ్య లింకు కుదిర్చింది కూడా లింగమనేనే అనే ప్రచారం అందరికీ తెలిసిందే.



అలాంటి లింగమనేని మీద హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఆయన చేసిన మోసాలపై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు చైతన్య గ్రూపు విద్యాసంస్ధల ఛైర్మన్ బీఎస్ రావు చెప్పారు. తనను మోసంచేసిన లింగమనేని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ చెప్పారు. తన ఫిర్యాదు ప్రకారం లింగమనేని మీద కేసులు నమోదైనట్లు తెలిపారు. అసలు బీఆర్ ను లింగమనేని ఏమి మోసం చేశారు ?



చైతన్య విద్యాసంస్ధల విస్తరణకు బీఆర్ దగ్గర డబ్బులు తీసుకున్నారట. విద్యాసంస్ధల విస్తరణకు లింగమనేనికి తాము రు. 310 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. వందల కోట్ల రూపాయలు తీసుకున్న రమేష్ తమను మోసం చేసినట్లు ఆరోపించారు. తామిచ్చిన డబ్బులు అడిగినపుడు చెక్కులిచ్చారట. అయితే రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చెల్లలేదని చెప్పారు. ఇదే విషయమై రమేష్ తో మాట్లాడినపుడు న్యాయంచేస్తానని, భూములు ఇప్పిస్తానని 2016లో ఎంవోయూ కూడా చేసినట్లు బీఆర్ ఆరోపించారు.



చివరకు దాన్ని ఉల్లంఘించటంతో హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే అమరావతి ల్యాండ్ స్కామ్ లో రమేష్ పైన చాలా ఆరోపణలున్నాయి. చూస్తుంటే చంద్రబాబునాయుడు అండ చూసుకుని బీఆర్ కు భూములిప్పిస్తానని అగ్రిమెంట్ చేసుకున్నట్లున్నారు. ఎందుకనో సాధ్యం కాకపోవటంతో చేతులెత్తేశారు. బీఆర్ దగ్గర తీసుకున్నట్లే ఇంకా ఎంతమంది దగ్గర ఇలా వందల కోట్ల రూపాయలు తీసుకున్నారో తెలీదు. అసలు విద్యాసంస్ధల విస్తరణకు రమేష్ ఏ విధంగా సాయం చేయాలని అనుకున్నారో అర్ధంకావటంలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: