అమరావతి : జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారా ?

Vijaya


పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళనకు ముహూర్తం కుదిరిందని ఎప్పటినుండో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఏదో కారణంతో వాయిదాపడిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు అధికారికంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏ విషయమూ చెప్పలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మంత్రివర్గం బాధ్యతలు తీసుకున్నది.ఆ సమయంలో మాత్రం రెండున్నరేళ్ళ తర్వాత పనితీరు ఆధారంగా కొందరిని మార్చేస్తానని మాత్రం ప్రకటించారు. జగన్ చెప్పిన రెండున్నరేళ్ళ సమయం అయిపోయింది. అప్పటి నుండి మంత్రివర్గంలో మార్పులని, ప్రక్షాళనంటు ఎవరికి తోచినట్లు మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారు. కొంతకాలంగా ఇలాంటి కథనాలు, వార్తలు ఎందుకనో ఎక్కడా కనబడలేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఈనెల 16వ తేదీకానీ లేదా 22వ తేదీకానీ మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందంటు కథనాలు మొదలయ్యాయి.పై రెండు తేదీలే ఎందుకు వినిపిస్తున్నాయంటే ఈనెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవబోతున్నాయి. ఎప్పటికప్పుడు ఏవో కారణాలతో వాయిదా పడుతోంది కాబట్టి బడ్జెట్ సమావేశాల ముందే మంత్రివర్గ ప్రక్షాళన చేసేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాధరెడ్డి లాంటి వాళ్ళను కంటిన్యు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే సీదిరి అప్పలరాజు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ కూడా కంటిన్యు అవుతారట. మంత్రివర్గం ఏర్పాటంటే సామాజికవర్గాల సమీకరణ ఎలాగూ చూస్తారని తెలిసిందే. మొదటి నుండి సామాజికవర్గాల తూకాన్ని జగన్ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే చివరి ఇద్దరు మధ్యలో మంత్రులయ్యారు కాబట్టే. మొదటి నలుగురు బాగా సీనియర్లు కాబట్టే. అంటే స్ధూలంగా 15 మందిని మార్చేసే అవకాశాలున్నట్లు అర్ధమవుతోంది. రేపటి మంత్రివర్గం దాదాపు ఎన్నికల మంత్రివర్గమనే అనుకోవాలి. ఎందుకంటే మధ్యలో మంత్రులను మార్చేందుకు జగన్ ఇష్టపడరు. మరి మంత్రివర్గం నుండి తప్పించబోతున్న వాళ్ళకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది. అంతాబాగానే ఉందికానీ సిట్టింగుల్లో టికెట్లు ఎంతమందికి ఇస్తారనే విషయంలో మాత్రం క్లారిటి లేదు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: