ఏపీలో నీట్ పరీక్ష... ఎక్కడెక్కడ...?

Sahithya
కరోనా పరిస్థితిలో దేశ వ్యాప్తంగా విద్యార్ధుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా ఉన్నా సరే జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎన్టియే కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్ధులు పరీక్ష రాయడానికి ఏ విధంగా రావాలో స్పష్టం చేసింది. పరీక్షకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరీక్ష.చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు.
నీట్ పరీక్షకు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ లో అని ఏర్పాట్లు పూర్తి చేసారు. రాష్ట్రంలో 10 పట్టణల్లో 151పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారు అధికారులు.. 59 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం1.30 గంటలకల్లా కేటాయించిన పరీక్ష కేంద్రాలకు అని స్పష్టం చేసారు. తొలిసారిగా మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో పరీక్ష కేంద్రం నిర్వహిస్తున్నారు.
పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు అని తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే గదులను శానిటైజేషన్‌ చేసారు అధికారులు. అన్ని వసతులతోపాటు పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు  ఏర్పాట్లు చేసారు.  విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్ష కేంద్రానికి రావాలి అని ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆభరణాలకు అనుమతి లేదు అని వివరించారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు విధిగా ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో తీసుకురావాలి అని స్పష్టం చేసారు. కోవిడ్‌ నిబంధనల మేరకు మాస్కు, గ్లౌజులు ధరించాలి. వాటర్‌ బాటిల్, శానిటైజర్‌ చిన్న బాటిల్‌ కు అనుమతి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: