జోహార్...అమెరికా వరదల్లో భారతీయులు చూపించిన మానవత్వం

Narayana Molleti
అమెరికా లోని  రెండో అతి పెద్ద  రాష్ట్రమైన టెక్సాస్ ని గత నాలుగైదు రోజులుగా హార్వే హరికేన్ ( సుడిగాలిలో కూడిన తుఫాను వాతావరణం ) అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరం తీవ్రంగా నష్టపోయింది. రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేయడంతో, ఇల్లు విడిచి ప్రజలందరూ సహాయక శిబిరాలకు చేరుకుంటున్నారు. 


గత ఎన్నో సంవత్సరాల నుండి  ఇప్పటి వరకు సంభవించిన హరికేన్ లలో అతి భారీ హరికేన్ ఇదే అని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు హార్వే దాటికి దాదాపు యాభై మంది పౌరులు మృతి చెందారు ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ఇది చాలా ఘోరమైన విపత్తుగా అక్కడి మేయర్ ప్రకటించారు. మరో మూడు రోజులు ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలందరినీ జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించారు. 


ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారీ వరదలకు తట్టుకోలేక ఇళ్ల నుండి ప్రజలు దగ్గరలోని సహాయ శిబిరాలకు  చేరుకుంటుంటే, ఖాళీగా  ఉన్న ఇళ్లలోకి దొంగలు ప్రవేశించి నిలువునా దోచేస్తున్నారు. కనపడ్డ వస్తువులన్నిటిని ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ దోపిడీ పర్వం మరీ తీవ్ర రూపం దాలుస్తుండటంతో, అక్కడి పోలీస్ లు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. దీనిని బట్టి అక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్ధమవుతుంది. ఇదే విషయాన్ని బి.బి.సి న్యూస్ సంస్థ వెల్లడించింది. 


టెక్సాస్ రాష్ట్రంలో లక్షకు పైగా భారతీయులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. హరికేన్ వినాశనం సృష్టిస్తున్న ప్రాంతాల్లో కూడా భారతీయులు అధికంగా నే ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఎత్తు ప్రాంతాల్లో  ఉన్న గుళ్ళు, గురుద్వారాలు వాటితో పాటు మరెంతో మంది భారతీయుల ఇల్లు, ఏవైతే సురక్షితంగా ఉన్నాయో అలాంటి వాటిల్లో భాదితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు భారతీయులు.

ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులను సమకూరుస్తున్నాయి. అక్కడి భారతీయ స్వచ్చంద సంస్థలు కూడా క్రియాశీలంగా పాల్గొంటున్నాయి. అంతే కాకుండా అక్కడ వరదల్లో చిక్కుకున్న భాదితులకు సహాయ సహకారాలు అందించడంలో, చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భారత దేశం గొప్పతనం నలుదిశలా వ్యాపించేలా  క్లిష్ట పరిస్థితుల్లో దేశ విదేశాల్లో  భారతీయులు మానవత్వం తో వ్యవహరిస్తున్న తీరుని అందరూ మెచ్చుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: