వారసుల రాజకీయం మొదలు పెట్టిన జగన్ ? అక్కడ గెలుపు కోసమేనా ?

జగన్ వ్యూహం మార్చారు. ఇప్పటి వరకు పార్టీలోకి చేరికలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా, ఇకపై చేరికల విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపించలేదు. కాకపోతే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మాత్రం సరికొత్త రాజకీయానికి తెర తీశారు. ఎమ్మెల్యేలు పార్టీలో చేరితే వారిపై ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలనే నిబంధన జగన్ స్వయంగా విధించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరకుండానే అనుబంధంగా కొనసాగుతున్నారు.  నేరుగా ఎమ్మెల్యేలను, కీలకమైన ప్రజాప్రతినిధులను జగన్ నేర్చుకోకుండా వారి వారసులను ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటూ సరికొత్త రాజకీయానికి తెర తీశారు.

 తాజాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ఇద్దరు కుమారులతో కలిసి జగన్ ను కలిశారు. ఆ తర్వాత గణేష్ కుమారులు ఇద్దరికీ వైసీపీ జెండా జగన్ కప్పారు. ఇక ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి నేరుగా చేరకపోయినా, ఆయన కుమారుడు గంటా రవితేజను పార్టీలో యాక్టివ్ చేసి, వెనుక ఉండి చక్రం తిప్పేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ప్రస్తుతం విశాఖ జిల్లా నేతల పైన వైసిపి గురి పెట్టడానికి కారణం లేకపోలేదు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, అక్కడ వైసీపీ ఆధిపత్య పోరు ప్రదర్శించేందుకు, టిడిపిని మరింత దెబ్బతీసేందుకు ఈ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. వాసుపల్లి గణేష్ బాబు ఎలాగూ టీడీపీకి దూరమయ్యారు , నేడు గంటా శ్రీనివాస రావు, ఆ తర్వాత గణబాబు వైసిపిలో చేరడం దాదాపు ఖాయమైంది.

 విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ వైసిపికి ప్రతికూల ఫలితాలు రాకుండా చూసేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎమ్మెల్యేలను, వారసులను వైసీపీ వైపు తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తున్నారు. అలాగే సామాజిక వర్గాల లెక్కలు కూడా వేసుకుంటూ, కీలకమైన నాయకులందరినీ లాగేసే పనిలో వైసిపి ఉంది. దీనిలో భాగంగానే యువ నాయకులపైన గురి పెట్టినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: