బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన కీర్తి సురేష్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో కలిసి సినిమా..!?

Anilkumar
ఇప్పుడున్న అందరూ హీరోయిన్స్ అన్ని భాషల్లో సినిమాలు చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఇతర భాషల్లోనూ తమకున్న టాలెంట్ను చూపించాలి అని ఆశపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా కొనసాగుతున్న చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అందులో రష్మిక మందన పూజ హెగ్డే వంటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అన్నారు. ఇక ఈ హీరోయిన్స్ తెలుగులోనే కాకుండా తమిళ హిందీ సినిమాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ బ్యూటీస్ సైతం ఇప్పుడు బాలీవుడ్

 సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మొన్న మధ్యాహ్నం నయనతార సైతం జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది .ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక టాలీవుడ్ యంగ్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు తెలుగు నాట మహానటిగా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న కీర్తి సురేష్. తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ తమిళంలోనూ స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. అయితే మొన్నటి వరకు మంచి మంచి

 పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటి ఇప్పుడు గ్లామరస్ లుక్ లో కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్ తో పటు బాలీవుడ్ లోనూ నటిస్తుంది. బాలీవుడ్ లో కీర్తిసురేష్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ లో నటిస్తుంది. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బాలీవుడ్ లో కీర్తిసురేష్ అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ నెక్స్ట్ లో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఈ వార్తల పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే కీర్తిసురేష్ క్రేజ్ బాలీవుడ్ లో పెరగడం ఖాయం. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో ఓ ను రూపొందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: