ఏపీ : భారీగా పోలింగ్.. నిరాశలో టీడీపీ.. కారణం అదేనా..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రశాంతం గా ముగిసింది...తమ నాయకుడిని ఎన్నుకోవడం కోసం ఓటర్లు  భారీగా తరలి వచ్చారు.సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది..పోలింగ్ సమయం దాటినా కూడా ఓటర్లు క్యూ లైన్ లో ఉండటం తో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది.గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా జరిగింది.మహిళా ఓటర్లు భారీ గా తరలి వచ్చి ఓటు వేశారు.అయితే అర్బన్ ప్రాంతాల్లో మధ్నాహ్నం తరువాత ఓటర్ల రాక తగ్గింది. కాగా, ఎన్నికల ఘర్షణల పై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ప్రజల్లో వైసీపీకి వస్తున్న స్పందన చూసి టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసిందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు మరియు దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. ఓటమి భయం తో టీడీపీ దాడులకు దిగిందని ఆయన తెలిపారు.. 


వైయస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించారని ఆయన తెలిపారు.రాష్ట్రం లో భారీగా పోలింగ్ శాతం పెరిగింది. మహిళా ఓటర్లు వృద్దులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ ఐదేళ్ల పాలన లో బడుగు బలహీన వర్గాలకు ఎంతగానో న్యాయం చేసిన జగన్ ను మళ్ళీ గెలిపించుకునేందుకు ఓటర్లు పోటెత్తారు. ప్రజలలో వైసీపీకి భారీ స్పందన చూసి టీడీపీ శ్రేణులు దాడికి చేసినట్లు గా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల సర్వే లో కూడా వైసీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. దీనితో టీడీపీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు.సోషల్ మీడియా లో కూడా టీడీపీ శ్రేణులు వరుస గా పోస్టులు పెడుతూ ఈ సారి కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: