డెలివరీ తర్వాత అలాంటి సమస్యలను ఎదుర్కొన్నాను... ఉపాసన..!

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రామ్ చరణ్ భార్యగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె గొప్ప బిజినెస్ వుమెన్ గా కూడా ఎంతో కీర్తిని గడిచింది . ఇకపోతే రామ్ చరణ్ , ఉపాసన వివాహం చాలా సంవత్సరాల క్రితమే జరిగింది . ఇక వీరికి కొన్ని రోజుల క్రితమే ఓ పండంటి బిడ్డ జన్మించింది . ప్రస్తుతం ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ రామ్ చరణ్ , ఉపాసన ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి , ఆ తర్వాత ఎలా అందులో నుండి రికవర్ అయ్యాను అనే విషయాలను ఈమె చెప్పుకొచ్చింది . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఉపాసన మాట్లాడుతూ ... తల్లి కావడం అనేది ప్రతి మహిళ కు ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నేను కూడా వారిలాగానే డెలివరీ తర్వాత చాలా ఒత్తిడికి లోనయ్యాను.

అలాగే డెలివరీ తర్వాత నేను డిప్రెషన్ లోకి కూడా వెళ్లాను. ఇక నేను అలా డిప్రెషన్ లోకి వెళ్లిన సమయం లో రామ్ చరణ్ నాకు ఎంతో సహాయం చేశారు. ఆయన బెస్ట్ దేరపిస్ట్ గా వ్యవహరించి నన్ను డెలివరీ తర్వాత డిప్రెషన్ నుండి బయటకు తీసుకువచ్చారు. ఇక రామ్ చరణ్ , ఉపాసన వారి కూతురికి క్లింకార అనే పేరు పెట్టారు క్లింకార తమ జీవితం లోకి వచ్చాక మా లైఫ్ ఎంతో సంతోషకరంగా మారింది అని ఉపాసన తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: