కల్కి డబ్బింగ్ పూర్తి చేసిన దీపికా పదుకొనే.. ఇక సినిమాలకి బ్రేక్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఇక దీపిక పదుకొనే ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ లతో పాటు బాలీవుడ్ స్టార్

  స్టార్ హీరో అమితా బచ్చన్ అశ్వద్ధామ గా కనిపించబోతున్నారు. ఆయనతో పాటు విలక్షణ నటుడు కమలహాసన్ సైతం ప్రతి నాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. పశుపతి దిశా పటాన్ని వంటి స్టార్స్ అందరూ కూడా కొన్ని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పాన్ ఇండియా ప్రభాస్ అభిమానులు అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి

 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే కల్కి సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ దీపికా తాజాగా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ సినిమా హిందీ కన్నడ భాషల్లో దీపిక పదుకొనే డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. జూన్‌ నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకోనుకుంటున్నారట. అందుకే కల్కి 2898 ఏడీలో తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారట. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా పలు భాషల్లో రిలీజ్ కానుంది. అయితే హిందీ, కన్నడ వెర్షన్లకు మాత్రమే దీపికా డబ్బింగ్‌ చెప్పారు. ఇతర భాషల్లో వేరేవారితో డబ్బింగ్‌ చెప్పిస్తారా? లేదా దీపికానే చెబుతారా? అన్నది ఇంకా తెలియరాలేదు. ఇక ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ కనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: