ఈరోస్ ఇంటర్నేషనల్ కు బాసటగా పవన్ ?

Seetha Sailaja
ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ కు టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ బాసటగా మారబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా నిర్మించిన ‘1-నేనొక్కడినే' చిత్రానికి సమర్పకులుగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ‘వన్’ సినిమా ఘోర పరాజయంతో ఈ సంస్థకు భారీ నష్టాలు మిగిలాయి. దీనితో ఈ సంస్థ దృష్టి పవన్ నటించబోతున్న ‘గబ్బర్ సింగ్-2’ పై పడింది అని అంటున్నారు. ఈమధ్య కాలంలో పవన్ తన ‘గబ్బర్ సింగ్-2’ ను వెనక పెడదామని ఆలోచన వచ్చినా ఈ సినిమా నిర్మాణం ఆగదు అంటూ ఆ సినిమా నిర్మాత శరత్ మరార్ ప్రకటించడం వెనుక ఈరోస్ ఇంటర్నేషనల్ పెద్ద వ్యవహారమే నడిపింది అనే వార్తలు వినపడుతున్నాయి. ఈ సంస్థ గబ్బర్ సింగ్-2 నిర్మాణానికి కావలసిన పెట్టుబడి అందించడమే కాకుండా ఈ సినిమాను అత్యధిక మొత్తానికి కొనుగోలు చేస్తామని శరత్ మరార్ కు ఈరోస్ భారీ ఆఫర్ ఇచ్చింది అని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎవరు ఊహించనంత భారీ మొత్తాన్ని ఈరోస్ ఆఫర్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి.  అయితే సినిమా నిర్మాణంలో కార్పోరేట్ కంపెనీల ప్రాబల్యాన్ని అంగీకరించని పవన్ ఈరోస్ వేస్తున్న ఎత్తుగడకు అంగీకరిస్తాడా? అధికారికంగా ప్రకటన విడుదల అయినా అసలు ‘గబ్బర్ సింగ్-2’ పట్టాలు ఎక్కుతుందా? దర్శకుడు మారుతాడా? అనే ఎన్నో ప్రశ్నల మధ్య ‘గబ్బర్ సింగ్-2’ వార్తలు యిలా ఇంకా ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: