అదిరిపోయే లుక్ లో బాలయ్య బాబు…!
ఇటువంటి నేపథ్యంలో తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఒప్పుకున్న సినిమా షూటింగ్ తాజాగా మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. సి కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డబల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. చాలా వైవిధ్యమైన పాత్రలో బాలయ్య బాబుని కె.ఎస్.రవికుమార్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బాలయ్య లుక్ ఒకటి బయటపడింది. దీంతో చాలామంది బాలయ్య బాబు కొత్త లుక్ ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా బాలయ్యను కంప్లీట్ గా ఫోటోలో మారిపోయింది. బాలయ్య అభిమానులకు సైతం ఈ లుక్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. స్టైలిష్ గా కనిపించే ఫ్రెంచ్ కట్ గడ్డం లుక్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటో చూసి చాలా మంది నెటిజన్లు అభిమానులు బాలయ్య వయసు 20 ఏళ్ళు తగ్గిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీలు వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.