శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైవ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమాణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’సినిమాతో హీరోగా నటించాడు. మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వెంటనే సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’సినిమాలో నటించాడు. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ ఉన్నా యూత్ కి నచ్చే మంచి ప్రేమ కథ ఉండటంతో బాగా కనెక్ట్ అయ్యారు. అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
ఇక హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకునే సమయంలోనే గీతాగోవిందం సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారే స్టార్ హీరోగా మారాడు. ఆ తర్వాత టాక్సీవాలా కూడా మంచి సక్సెస్ సాధించింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో కూడా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ మద్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘డీయర్ కామ్రెడ్’ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఈ మద్య కాలంలో సినిమాలు కాస్త రొటీన్ కి భిన్నంగా వస్తున్న వస్తున్నవిషయం తెలిసిందే.
ఆ మద్య మాస్ మహరాజ రవితేజ ‘రాజా ది గ్రేట్ ’ సినిమాలో పూర్తిగా అంధుడిగా నటించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో నత్తి పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించింది. రంగస్థలం సినిమాలో రాంచరణ్ చెవిటివాడి పాత్రలో కనిపించారు. ఇక ప్రయోగాత్మక పాత్రలో ఒకప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ ఎన్నో అద్భుత పాత్రల్లో నటించారు. తాజాగా వీరి బాటలోనే నడుస్తున్నారు విజయ్ దేవరకొండ. రొటీన్ కి భిన్నంగా కొత్తదనం ఆశిస్తున్నారు. తాను కూడా ఓ ప్రయోగాత్మక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. ఇటీవల పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టుని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. పూరి ఎప్పుడైతే స్క్రిప్టు పూర్తి చేసి ఓకే అనిపించుకుంటారో అప్పుడే సినిమా పట్టాలు ఎక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని ఏ బ్యానర్లో చేయాలనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదనితెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం.