డాషింగ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న విజయ్?
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తుండడమే దానికి కారణం . సూపర్ స్టార్ మహేష్ బాబుతో గతంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ జనగణమన సినిమాను రూపొందించాలని అనుకున్నాడు . కానీ ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు . తాజాగా విజయ్ దేవరకొండ తో అదే సినిమాను చేసేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన దర్శకుడు పూరీ జగన్నాధ్ తో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు . పూరీ మాత్రం ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమాను చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది . దర్శకుడు పూరీ జగన్నాధ్ తో సినిమా అనగానే విజయ్ దేవరకొండ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ చేతినిండా సినిమాలు ఉండటంతో, మరో రెండేళ్ల వరకు డేట్స్ ఖాళీగా లేవని తెలుస్తోంది.
అయినా కూడా పూరీ జగన్నాధ్ తో సినిమా చేయడానికి విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్టు ను పక్కకు పెట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి . విజయ్ హీరోగా పూరీ జగన్నాధ్ రూపొందించనున్న చిత్రం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు . విజయ్ హీరోగా పూరీ జగన్నాధ్ రూపొందించే సినిమా అసలు ఉంటుందా ?లేదా ? అన్నది కూడా సస్పెన్సే నని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి .