టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీల్లో ‘మన్మథుడు’ ఒకటి. ఈ మూవీకి కె.విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నాగార్జున ఫస్టాఫ్ లో ఎంత అందంగా కనిపిస్తాడంటే నిజంగా మన్మథుడు అనిపించేలా. ఈ మూవీలో మనసుకు హత్తుకునే ప్రేమ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంది. ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచన అప్పట్లో నాగార్జునకు వచ్చిందట..కానీ దాన్ని మాత్రం లైన్లో పెట్టలేక పోయారు.
చాలా కాలం తర్వాత రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో ‘మన్మథుడు 2’సీక్వెల్ కి రంగం సిద్దం చేశారు. ఈ మూవీలో నాగార్జున సరసన రకూల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీకి సవంంంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు..మంచి స్పందన వచ్చింది. దానితో పాటే ఈఇందులో లిప్ లాక్ సీన్లపై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలో రకూల్ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందట.
తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టడం ఖాయమని అంటున్నారు. ట్రైలర్, పోస్టరర్లు చూస్తుంటేనే పొట్టి బట్టలతో అందాలను ఆరబోస్తూ హాట్‌గా కనిపిస్తోంది. మొత్తానికి రకుల్ తన గ్లామర్ తో సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదలచేయనున్నారు.