చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!

Edari Rama Krishna

భారత దేశంలో గత కొంత కాలంగా ఆడపిల్లు పుడితే ఇంటికి భారం అని భావిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.  కొంత మంది దుర్మార్గులు పురిటిలోనే ఆడశిశువులను అంతం చేస్తున్నారు.  ఆడపిల్లలు పుట్టారని చెత్తకుప్పల్లో పడవేసిన ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  ఈ మద్య రాజస్థాన్ లోని ఓ పసికందుని చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకున్నారు.


ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడవడంతో స్థానికులు గుర్తించి  పాపని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో దర్శకుడు వినోద్ కాప్రి దృష్టికి రావడంతో వెంటనే ఆ హాస్పిటల్ కి చేరుకొని ఆ పాపని దత్తత తీసుకుంటానని చెప్పాడట. అందుకోసం ఫార్మాలిటీస్ పూర్తి చేసి పాపను తత్తత తీసుకునే పనిలో ఉన్నారు దర్శకులు.  అంతేకాదు.. తాను తెరకెక్కించిన సినిమా టైటిల్ 'పీహూ'ని ఆ పాపకి పేరుగా పెట్టారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాను ప్రస్తుతం ఆ లిటిల్ ఏంజెల్ లో ప్రేమలో పడ్డామని.. దత్తత తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అయితే పాప ఇంటి వచ్చే వరకు తాను ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని..పాప ప్రస్తుతం 1.6 కేజీల బరువు ఉండగా.. ఆసుపత్రిలో చేరే సమయానికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిందట...ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. 

A hug from ALL of you to little angel ... So divine ... pic.twitter.com/a8xDMhDnj5

— Vinod Kapri (@vinodkapri) June 16, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: