మహేశ్ బాబు ఆ సినిమా అందుకే ఫ్లాప్ అయ్యిందా...?

Chakravarthi Kalyan

మహేశ్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో వచ్చిన తొలిచిత్రం అతడు. ఎంతగా హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. మళ్లీ అదే కాంబినేషన్ లో వచ్చి చాలా అంచనాలు ఉన్న సినిమా ఖలేజా.. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినా టీవీలో వస్తుంటే చాలా మంది ఆసక్తి గా చూస్తున్నారు.



ఈ సినిమా పరాజయం మీద.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తాజాగా విశ్లేషించారు. టీవీలో వచ్చే సినిమాల్లో 'అతడు' తరువాత నేను ఎక్కువగా చూసిన సినిమా 'ఖలేజా' అన్నారాయన. ఇందులో మనకి మూడు కథలు కనిపిస్తాయి. ఒకటి హీరో అప్పు కథ .. రెండవది హీరోయిన్ ఇంట్లో నుంచి పారిపోయి రాజస్థాన్ చేరుకునే కథ .. మూడవది ఓ దేవుడులాంటి మనిషి కోసం రాజస్థాన్ లోని ఓ గ్రామస్తులు వెయిట్ చేసే కథ.



ఈ కథను ముందుగా నేను విని వుంటే, 'సార్ .. గ్రామంలో కథను ముందుగా మొదలుపెట్టొద్దు' అని చెప్పేవాడిని. ఎందుకంటే గ్రామస్తులలో ఒకరు తమకి అండగా నిలిచే దేవుడిని తీసుకురావడానికి వెళతాడు. దైవత్వానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి .. అతణ్ణి ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పి పంపించిన తరువాత, దాదాపు గంటసేపు వేరే కథ నడుస్తుంది.



ఈ గంటసేపు కూడా హీరో వైపు నుంచి కథ చాలా కామెడీగా వెళ్లిపోతూ ఉంటుంది. హీరోయిన్ ను ఐరన్ లెగ్ గా పరిచయం చేయడం వలన, ఆడిటోరియంలోని అమ్మాయిలెవరూ ఆ పాత్రకు కనెక్ట్ కాలేకపోయారు అంటూ ఆ సినిమా పరాజయం వెనుక ఉన్న కథ చెప్పారు. ఈ సినిమా అలా ప్రారంభం కాకుండా ఉంటే బాగా ఆడి ఉండేదన్నారు పరుచూరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: