బీదర్ ప్రజలతో ఉయ్యాలవాడకు తిరస్కరణ !

Seetha Sailaja
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘సైరా’ ను ఈ ఏడాది దసరా కు విడుదల చేసి తీరాలి అని చిరంజీవి ఇచ్చిన టార్గెట్ తో ‘ఉయ్యాలవాడ’ యూనిట్ పరుగులు తీస్తోంది. ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే మరొకవైపు ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ పనులలో ఏమాత్రం జాప్యం లేకుండా పూర్తి చేయడానికి సురేంద్ర రెడ్డి ద్విముఖ వ్యూహాలు కొనసాగిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ఊహించని విధంగా ‘సైరా’ విడుదల కాకుండానే కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంత ప్రజల తిరస్కరణకు గురికావడం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య ‘సైరా’ యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణ కోసం బీదర్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్ కు సంబంధించి అన్ని పర్మిషన్స్ తీసుకుని ‘సైరా’ యూనిట్ బీదర్ కు చేరుకున్న తరువాత ఊహించని విధంగా అక్కడి స్థానికుల నుండి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. 

ముఖ్యంగా ఈ షూటింగ్ కోసం వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు కత్తులు తలపాగాలు గెడ్డాలు పెట్టుకుని షూటింగ్ కు రెడీ కావడంతో ఈ హదావిదిని చూసిన బీదర్ లోని ఒక వర్గం వారు ఈ షూటింగ్ కొనసాగించడానికి తాము అంగీకరించమనీ బీదర్ చాల సెన్సిటివ్ ఏరియా అని అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థుతుల రీత్యా ఇలాంటి ప్రయోగాలు వద్దనీ సూచించినట్లు టాక్. దర్శకుడు సురేంద్ర రెడ్డి బీదర్ ప్రాంతంలో అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రజలకు ఎంత నచ్చ చెప్పినా వారు అంగీకరించక పోవడంతో ‘సైరా’ యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దీనితో మారిన పరిస్థుతులకు అనుగుణంగా సురేంద్ర రెడ్డి ‘సైరా’ షూటింగ్ ను రామోజీ ఫిలిం సిటీలో కాని లేదంటే కోకాపేటలో కానీ బీదర్ వాతావరణానికి అనుగుణంగా ఒక సెట్ వేసి షూట్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈమూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోలను సమ్మర్ సీజన్ లో అప్పుడప్పుడు విడుదల చేస్తూ ఈమూవీకి సమ్మర్ నుండే ప్రమోషన్ మొదలు పెట్టాలని సురేంద్ర రెడ్డి ఆలోచన అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: