భార్యతో నగ్నంగా సెల్ఫీ.. కుర్ర హీరో వెర్రి వేషాలు..?

Chakravarthi Kalyan

ప్రేమికుల రోజున చాలా మంది సోషల్ మీడియాలో తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొందరు హీరో హీరోయిన్లు తమ ప్రేమకు గుర్తుగా కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఇవన్నీ చాలా ఇంట్రస్టింగ్ గా ప్రేమ గొప్పతనాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి.



కానీ ఓ కుర్ర హీరో మాత్రం.. వెర్రి పని చేసి నెటిజన్లతో చీవాట్లు తిన్నాడు. బాగా పాపులర్ కావాలనుకున్నాడో ఏమో.. ఏకంగా భార్యతో అర్థనగ్నంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరనుకుంటున్నారా.. బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్.



అతడు ఇటీవలే తన గాళ్ ఫ్రెండ్ సాన్యా సాగర్ ని పెళ్లాడాడు. ప్రేమికుల రోజు అతడు పోస్ట్ చేసిన ఫోటోలో.. భార్య అర్థనగ్నంగా నిలుచుని ఉంది.. తన వెనక భాగంలో నిలుచుని ప్రయివేటు పార్ట్స్ కవర్ చేస్తూ అతడు చేతిని అడ్డం పెట్టాడు. ఆ సెమీ న్యూడ్ వ్యవహారాన్ని సెల్ఫీ తీస్తోంది సదరు భార్యామణి.



పాపులర్ సెలబ్రిటీలు స్మితాపాటిల్-రాజ్ బబ్బర్ దంపతులు కుమారుడే ఈ ప్రతీక్. గత ఏడాది భాఘి 2 చిత్రంతో చక్కని హిట్ కొట్టాడు. ముల్క్ మిత్రోన్ చిత్రాలతోనూ మెప్పించాడు. ఇప్పుడు ప్రతీక్ పెట్టిన ఈ ఫోటోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఫోటో ద్వారా ఏం సందేశమిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. పబ్లిసీటీ కోసం ఇంతగా దిగజారాలా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: