"సలార్ 2" లో "కేజీఎఫ్" నటుడు..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి కొనసాగింపుగా సలార్ పార్ట్ 2 ఉండబోతుంది అని మూవీ బృందం ఎప్పుడో ప్రకటించింది. అందుకు తగినట్లుగానే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పార్ట్ 2 షూటింగ్ ను కూడా ప్రారంభించింది.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే సలార్ పార్ట్ 2 లో ఓ కీలకమైన పాత్ర ఉండబోతున్నట్లు ఆ పాత్ర ఈ సినిమా కథను మరింత ఆసక్తిగా మలచబోతున్నట్లు ఆ వార్త వైరల్ అవుతుంది. ఇక అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అందులో ఒక అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలి అని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు అందులో భాగంగా ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటుడిని సెలెక్ట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక సలార్ పార్ట్ 2 మూవీ లో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకోవాలి అని మేకర్స్ అనుకున్నట్లు , అందులో భాగంగా ఆయనను సంప్రదించి కథ మొత్తాన్ని వివరించగా సంజయ్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. ఇకపోతే గతంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ పార్ట్ 2 మూవీ లో కూడా సంజయ్ దత్ నటించాడు. ఈయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలోని సంజయ్ నటనకు ప్రేక్షకులకు నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: