"ఇండియన్ 2" కి చరణ్ సహాయం..?

Pulgam Srinivas

దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా ఇండియన్ అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విషయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత శంకర్ , కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఇలా ఈ సినిమా చాలా రోజులు ఆగిపోవడంతో శంకర్ , రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. 


గేమ్ చేంజర్ సినిమా ప్రారంభం అయిన తర్వాత మళ్లీ ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. దానితో శంకర్ కొన్ని రోజులు ఇండియన్ 2 షూటింగ్ లను , మరికొన్ని రోజులు గేమ్ చేంజర్ షూటింగ్ లోను పాల్గొంటూ మొత్తానికి ఇండియన్ 2 షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశకు తీసుకువచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఇండియన్ 2 మూవీ ని జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని జూన్ లో కాకుండా జూలై లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 ఇకపోతే ఈ సినిమాలో ఓ ప్రముఖ వ్యక్తి వాయిస్ ఓవర్ చెప్పాల్సిన అవసరం ఉందట. కొన్ని సన్నివేశాలలో ఆ వాయిస్ ఓవర్ తోనే స్టోరీ ముందుకు వెళుతుందట. ఇక అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ వాయిస్ ఓవర్ ను రామ్ చరణ్ తో చెప్పించాలి అని మేకర్స్ అనుకుంటున్నాట్లు , దానికి చరణ్ కూడా ఓకే చెప్పినట్లు మరికొన్ని రోజుల్లోనే ఆ పనులను మొదలు పెట్టబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: