పవన్ రాజకీయాల పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలలో ఆశ్చర్యకర కోణాలు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ సినిమాలని వదలిపెట్టి ‘జనసేన’ బాట పట్టి ప్రస్తుత రాజకీయాలలో క్షణం తీరిక లేకుండా గడుపుతూ  త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు ‘జనసేన’ పార్టీని సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ అనేక వ్యూహాలు  రచిస్తున్నాడు. ఈ విషయాల పై మంచు మనోజ్ స్పందిస్తూ పవన్ రాజకీయాలకు సంబంధించి తన ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అన్న కోణంలో చర్చలు జరుగు తున్నాయి.  

ఈమధ్య కాలంలో ‘జనసేన’ పార్టీలోకి చేరికలు ఎక్కువ అయిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిగా ప్రముఖులందరిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు.  ఇటీవల జనసేన పార్టీలో చేరిన వారంతా విద్యావంతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో అధికారులుగా ఉన్నవారు కావడం విశేషం. మాజీ పోలీస్ అధికారులు మాజీ ఐఏయస్ అధికారులు సీనియర్ జర్నలిస్టులు ‘జనసేన’ పార్టీలో ఇటీవల చేరుతున్న నేపధ్యంలో ‘జనసేన’ కు కొత్త ఇమేజ్ ఎర్పరిచేలా పవన్ వ్యూహాలు రచిస్తున్నాడు. 

విద్యావేత్తలంతా ప్రజాసేవ చేసేందుకు ముందుకు రావడం రాజకీయాలకు ఆ పార్టీకి గొప్ప విలువ చేకూర్చే అంశం అని మంచు మనోజ్ అభిప్రాయపడుతున్నాడు. ‘పవన్ కళ్యాణ్ సర్ ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. విద్యావేత్తలకు తన పార్టీలో మంచి స్థానం కల్పించడం ద్వారా జనసేన పార్టీ గౌరవాన్ని, నమ్మకాన్ని పొందింది’ అంటూ  మనోజ్ ట్విట్టర్ లో తన అభిప్రాయం వ్యక్త పరిచాడు. 

ఈమధ్య కాలంలో సినిమాలకు దూరమైన మంచు మనోజ్ సామాజిక సేవ బాటపట్టి చిత్తూరు జిల్లాలో ఒక స్వచ్చంద సేవా సంస్థను నెలకొల్పి తన భావాలకు సహకరించే ప్రముఖ వ్యక్తుల కోసం రాయబారాలు నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో మనోజ్ రాజకీయాల బాట పడతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ మంచు మనోజ్ పవన్ పై కురిపించిన ప్రశంసలతో త్వరలో మనోజ్ కూడ ‘జనసేన’ బాట పట్టబోతున్నాడా అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: