నెట్టింటా వైరల్ అవుతున్న స్టార్ హీరో ప్రేమలేఖ..!!

murali krishna
దేశ వ్యాప్తంగా అత్యధిక క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ హీరోకు నార్త్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.సల్మాన్ ఇప్పటివరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఎప్పుడూ సల్లూ భాయ్ పర్సనల్ లైఫ్ గురించి ఏదోక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. అతడి లవ్, డేటింగ్ అంటూ బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చర్చలు జరుగుతుంటాయి. ప్రస్తుతం లు.. అటు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్టింగ్ చేస్తున్నాడు సల్మా్న్. గతేడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో కీలకపాత్రలో కనిపించాడు సల్మాన్. ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట సల్మాన్ ప్రేమలేఖ వైరలవుతుంది.
“నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ” అంటూ సల్మాన్ చేతిరాతతో రాసిన లెటర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఆ లెటర్ ఇప్పుడు రాసినది కాదు.. దాదాపు 34 ఏళ్ల నాటిది. అది కూడా ఓ అమ్మాయి కోసం కాదు.. తనను అమితంగా ప్రేమించే అభిమానుల కోసం సల్మాన్ ఆ ప్రేమలేఖను 1989లో రాశారు. సల్మాన్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ మూవీ మైనే ప్యార్ కియా. 1989 డిసెంబర్ 29న విడుదలైన ఈ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన నాలుగు నెలలకు అంటే 1990లో సల్మాన్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.“నన్ను అంగీకరించినందుకు… నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా శక్తి మేరకు మంచి స్క్రిప్ట్ పై పని చేస్తున్నాను. ఎందుకంటే నేను ఏ చేసినా మీరు మైనే ప్యార్ కియా మూవీతో పోలుస్తారని నాకు తెలుసు. అందుకే ఇకపై మంచి లు చేయాలని 100 శాతం ప్రయత్నం చేస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం మానేసిన రోజు నేను లు చేయడం ఆపేస్తాను. అదే నా కెరీర్ కు ముగింపు” అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: