ఆశిష్ : స్టేట్మెంట్ చాలా పెద్దది... సినిమాలో అంతా సత్తా ఉందా..?

Pulgam Srinivas
దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో రూపొందిన రౌడీ బాయ్స్ అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. సినిమా కథల ఎంపికలో అద్భుతమైన టేస్ట్ కలిగిన నిర్మాతలలో ఒకరు అని పేరు కలిగిన దిల్ రాజు తన సోదరుడి కుమారుడని లాంచ్ చేస్తున్నాడు అంటే చాలా గొప్ప కథతోనే ప్రేక్షకుల ముందుకు ముందుకు తీసుకు వస్తాడు అని ప్రేక్షకులు భావించారు.

దానితో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఆ తర్వాత ఈ నటుడు సెల్ఫిష్ అనే మూవీని మొదలు పెట్టాడు. ఆ సినిమా కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత ఆగిపోయింది. దానితో ఆశిష్ టైం వేస్ట్ చేయకుండా లవ్ మీ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇక ఈ మూవీ మొదలు పెట్టినప్పుడు పెద్దగా అంచనాలు లేవు.

కానీ ఎప్పుడు అయితే ఈ సినిమా నుండి ప్రచార చిత్రాలను విడుదల చేయడం మొదలు పెట్టారో అప్పటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక గత కొన్ని రోజులుగా విడుదల అయిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోవడం, అలాగే ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఐపీఎల్ మ్యాచ్ లపై ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉండడంతో థియేటర్ లకు జనాలు రావడం కరువైపోయింది.

దానితో కొన్ని థియేటర్లను మూసి వేశారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే లవ్ మీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాగంగా ఆశిష్ మాట్లాడుతూ ... ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. మూసిన థియేటర్లన్నింటిని ఈ సినిమాతో తెరిపిస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

దానితో సినిమాలో నిజంగానే అంత సత్తా ఉందా..? లేకపోతే సినిమాపై అంచనాలను పెంచడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమా నిజంగానే జనాలను భారీగా థియేటర్లకు రప్పించే స్థాయిలో ఉంటుందో... లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ మూవీ ని మే 25 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: