సమంత ఆ గ్రేట్ డైరెక్టర్ మూవీ ని రిజెక్ట్ చేసింది అనే విషయం మీకు తెలుసా..?

Pulgam Srinivas
సినిమా పరిశ్రమలో ఒక నటుడితో లేదా నటితో అనుకున్న సినిమా వేరే వాళ్ళతో చేసిన సందర్భాలు అనేకం ఉంటాయి. అలా ఒకరితో అనుకున్న సినిమా మరొకరితో తెరకెక్కించిన సందర్భంలో ఆ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఛా ఆ సినిమా ఎందుకు మిస్ చేసుకున్నాం. చేసి ఉంటే అద్భుతమైన విజయం దక్కి ఉండేది అని బాధపడిన సందర్భాలు ఉంటాయి.

అలాగే మిస్ చేసుకున్న సినిమా కనుక ఫ్లాప్ అయినట్లయితే ఆ రోజు ఆ సినిమా చేయను అని చెప్పింది చాలా మంచి పని అయింది. లేకపోతే పెద్ద ఫ్లాప్ మూవీ అకౌంట్ లో పడేది అని అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఓ నటుడు లేదా నటి చాలా కాలం కెరియర్ ను కొనసాగించినట్లు అయితే చాలా సినిమాలను వదులుకుంటూ వస్తారు.

అది సినిమా కథ నచ్చకపోవచ్చు లేక ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండొచ్చు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంత కూడా తన కెరియర్ లో ఓ సినిమాను మిస్ చేసుకుంది. ఆ సినిమా ఏమిటి ..? దాని రిజల్ట్ ఏమిటో తెలుసుకుందాం. ఇండియాలో అత్యంత గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో శంకర్ ఒకరు.

ఈయన కొన్ని సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా ఎమీ జాక్సన్ హీరోయిన్ రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మొదట ఎమీ జాక్సన్ ప్లేస్ లో శంకర్ , సమంత ను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు కథను కూడా వినిపించారట. కాకపోతే ఆమె ఆ సమయంలో ఇతర మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పారట.

దానితో శంకర్ , సమంత ప్లేస్ లో ఎమీ జాక్సన్ ను తీసుకున్నారట. అలా గ్రేట్ డైరెక్టర్ శంకర్ సినిమాలో సమంత అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇక ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకొని యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: