"దేవర" లో రొమాంటిక్ సాంగ్..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా , మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క చిత్రీకరణను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం దేవర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర యూనిట్ ఎన్టీఆర్ మరియు జాన్వి పై అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు , ఈ సాంగ్ ఈ సినిమాలోనే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ రొమాంటిక్ సాంగ్ కి అనిరుద్ కూడా అదిరిపోయే ట్యున్  ను ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ మూవీ తో పాటు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్ప్పెడ్ గా జరుగుతుంది. ఈ రెండు మూవీ ల షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే  సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి కూడా చాలా రోజులే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: