ఆ తేదీన "ఓటిటి" లోకి ఎంట్రీ ఇవ్వనున్న "విద్య వాసుల అహం"..!

Pulgam Srinivas
రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో విద్య వాసుల అహం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. డైరెక్టర్ మణికాంత్ గెల్లి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ధియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు.

 అందులో భాగంగా ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లో విడుదల చేయనున్నట్లు ఆహా సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది  ఇకపోతే గతంలో రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ఇందులో వీరిద్దరి నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

ఇలా ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా మంచి విజయం సాధించడం , వీరిద్దరు కూడా అందులో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మరికొన్ని రోజుల్లో నేరుగా విడుదల కానున్న విద్య వాసుల అహం అనే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తన్విక జస్విక క్రియేషన్స్ సమర్పణలో, ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవ్య మహేష్ ,  రంజిత్ కుమార్ కొడాలి , చందన కట్ట లు సంయుక్తంగా నిర్మిస్తున్న విద్య వాసుల అహం చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: