త్రివిక్రమ్ పై బన్నీ పై చేయి !

Seetha Sailaja
‘అరవింద సమేత’ లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చిన తరువాత కూడ త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం ఒక మెట్టు దిగిన పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత త్రివిక్రమ్ పెన్నులో ఇంకు అయిపోయింది అని సెటైర్లు పడినా ఆ కామెంట్స్ ను పట్టించుకోకుండా త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ కు మంచి అద్భుతమైన డైలాగ్స్ వ్రాసి విమర్శకుల ప్రశంసలు పొందినా త్రివిక్రమ్ తనలోని రచయితను అల్లు అర్జున్ కోసం రాజీపడేలా ఒక మెట్టు దిగాడు.

ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ కొన్ని కండిషన్స్ తో ఖరార్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ బన్నీకి ఇచ్చిన ఆప్క్షన్స్ అన్నీ పరిశీలించిన తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ చేత రీమేక్ మూవీని అధికారికంగా చేయిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో విడుదలై మంచి విజయం సాధించిన ‘సోను కి టిటు కి స్వీటీ’ మూవీకి కొద్దిగా మార్పులు చేసి తనతో రీమేక్ చేయమని బన్నీ త్రివిక్రమ్ ను కోరినట్లు టాక్. 

వాస్తవానికి ఈ రీమేక్ మూవీ చేసే విషయంలో త్రివిక్రమ్ ఆసక్తి కనపరచకుండా తాను బన్నీని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన రెండు కథలు వినిపించినా అల్లు అర్జున్ మనసు మాత్రం ఈ హిందీ రీమేక్ పైనే ఫైనల్ గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వక్కంతం వంశీ కథ నమ్ముకుని ‘నాపేరు సూర్య’ చేసినా అది విజయవంత కాకపోవడంతో కొత్త కథలను నమ్ముకోవడం కంటే ఒక రీమేక్ ను నమ్ముకోవడం మంచిది అన్న అభిప్రాయంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్ కెరియర్ లో ఇప్పటి వరకు తానే తన సినిమాలకు కథలు సమకూర్చుకునే వాడు కానీ అధికారికంగా ఎప్పుడు రీమేక్ సినిమాలు చేయలేదు. ‘అరవింద సమేత’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా చివరికి ఫైనల్ కలక్షన్స్ విషయంలో సతికల పడ్డ నేపధ్యంలో త్రివిక్రమ్ వేరే మార్గం లేక ఇలా ఒక మెట్టు దిగాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: