చరణ్ పై రకుల్ కామెంట్స్ కు ఆగ్రహంలో అభిమానులు !

Seetha Sailaja
ముంబాయి మోడల్ గా కెరియర్ ప్రారంభించి ఆతరువాత టాలీవుడ్ ఫిలిం ఎంట్రీ ఇచ్చి గత 7 ఏళ్లలో తెలుగులో 15 సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ సక్సస్ రేట్ 50 శాతం మాత్రమే అయినా ఆమె ఇప్పటి వరకు మన టాప్ యంగ్ హీరోలు అందర్నీ ఒకచుట్టు చుట్టేసింది. ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు అవకాశాలు రావడం లేదు అని జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ తనకు డేట్స్ కుదరక పోవడంతో చాల సినిమాలను తాను వదులుకుంటున్న విషయాలను బయట పెట్టింది.

ఇదే సందర్భంలో ఇప్పటి వరకు ఆమె నటించిన హీరోల మనస్తత్వం పై కామెంట్స్ చేసింది. మాస్ మహారాజ రవితేజాను చూస్తే తనకు ఒక ‘పవర్ హోస్’ గుర్తుకు వస్తుందని అదేవిధంగా జూనియర్ ను చూస్తే ఇండస్ట్రీకి ఒక ‘వరం’ అన్న అభిప్రాయం కలుగుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె మహేష్ గురించి మాట్లాడుతూ ‘ప్యాషనేట్’ హీరో అన్న ట్యాగ్ ఇచ్చింది.

అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ‘ఇండస్ట్రీని మరొక స్థాయికి’ తీసుకు వెళ్ళే హీరో అనీ సాయి ధరమ్ తేజ్ ‘నిజాయితీ’ ఉన్న వ్యక్తి అంటూ కామెంట్ చేసిన రకుల్ రామ్ చరణ్ దగ్గరకు వచ్చే సరికి ఎవరు ఊహించని ఒక షాకింగ్ కామెంట్ చేసింది. చరణ్ ను చూసినప్పుడల్లా తనకు ఒక ‘చిన్న పిల్ల వాడి మనస్తత్వం’ ఉన్న మనిషి గుర్తుకు వస్తాడు అంటూ కామెంట్స్ చేసింది. 

ఇప్పుడు ఈకామెంట్స్ రామ్ చరణ్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ‘మగధీర’ ‘రంగస్థలం’ లాంటి సినిమాలలో నటించి తన ఉద్వేగ పూరితమైన నటనతో లక్షలు సంఖ్యలో అభిమానులను ఏర్పరుచుకున్న రామ్ చరణ్ ను చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా గుర్తించి రకుల్ కామెంట్స్ చేయడం ఏమిటి అంటూ చరణ్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకు వెళ్ళే వ్యక్తిగా బన్నీని గుర్తించిన రకుల్ చరణ్ క్రియేట్ చేసిన రికార్డులను మరిచి పోయిందా అంటూ ఆమె పై సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే టాప్ హీరోల పక్కన అవకాశాలు లేక సతమతమవుతున్న రకుల్ ప్రీత్ కు అనుకోకుండా ఆమె యధాలాపంగా చేసిన కామెంట్స్ ఆమెకు చరణ్ అభిమానుల నుండి పెద్ద ముప్పును తెచ్చి పెట్టాయి అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: