కృష్ణంరాజుకు 100 కోట్లు కురిపించబోతున్న ప్రభాస్ ప్రకటన !

Seetha Sailaja
రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం తర్వాత నటిస్తున్న ‘సాహో’ నిర్మాణ పనులు గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నా మరెన్నో ఆఫర్స్ వచ్చినా  ప్రభాస్ వాటిని సెట్స్ పైకి తీసుకు వెళ్లలేదు. వచ్చే సమ్మర్ లో ‘సాహో’ విడుదలకావచ్చు అని అంటున్నారు. ప్రభాస్ కెరియర్ కు సంబంధించి గడిచిన ఏడు సంవత్సరాల్లో కేవలం  ‘బాహుబలి’ మరియు ‘సాహో’ చిత్రాలకు మాత్రమే ప్రభాస్ సమయం కేటాయించాడు అన్నది వాస్తవం. 

ఒక టాప్ హీరో ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యం అయిన రికార్డ్. ఈ నేపధ్యంలో గత కొంతకాలంగా ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు నిర్మాణంలో జిల్ రాథా కృష్ణ దర్శకత్వంలో ఒక భారీ మూవీ చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఈరోజు క్రియా రూపం దాల్చడమే కాకుండా దీనికి సంబంధించి ప్రభాస్ నుండి అధికారిక స్పందన కూడ వచ్చింది.    

ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈమూవీ ప్రారంభానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడమే కాకుండా తన త్రిభాష చిత్రం గురించి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని త్వరలో ప్రారంభంకాబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగినట్లుగా ప్రభాస్ వివరణ ఇచ్చాడు. దీనితో ప్రభాస్ కెరియర్ కు సంబంధించి 20వ సినిమా ఈరోజు అధికారికంగా ప్రారంభం అయింది. 

ఈవార్త అప్పుడే వైరల్ గా మారడంతో ఈ ప్రాజెక్ట్ కు రాబోయే లాభాల పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఒక లవ్ స్టోరీ నేపధ్యంలో నిర్మింపబడే ఈ సినిమా చాల వరకు యూరప్ లోనిర్మించబోతూ ఉన్నా ఈమూవీ బడ్జెట్ 100 కోట్లకు మించదు అని అంటున్నారు. అయితే ఈమూవీని మూడు భాషలలో నిర్మిస్తున్న పరిస్థుతులలో ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా ఈమూవీ బిజినెస్ ఖచ్చితంగా 200 కోట్ల స్థాయిలో జరుగుతుందని అప్పుడే లెక్కలు మొదలైపోయాయి. అయితే ఈమూవీ వచ్చే ఏడాది విడుదల అవుతుందా లేకుంటే 2020లో విడుదల అవుతుందా అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ప్రభాస్ తన ఇమేజ్ తో తన పెదనాన్న కృష్ణంరాజుకు 100 కోట్ల లాభం తెచ్చిపెట్టే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాడు అంటూ అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ మొదలైపోయాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: