రాప్తాడు: సునీతమ్మ గెలుపుతో.. ప్రకాష్ విల విల..!

Divya
రాప్తాడు.. అనంతపురం జిల్లాలో టిడిపికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఏంటి అంటే వెంటనే గుర్తొచ్చే ప్రాంతం రాప్తాడు.. పరిటాల రవి హయాం నుంచే రాప్తాడు టిడిపికి కంచుకోటగా మారిన విషయం తెలిసిందే. అయితే పరిటాల రవి మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.. అయితే 2019 ఎన్నికలలో అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడును కైవసం చేసుకుంది ..2019లో వైసీపీ పార్టీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 25,575 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీకి చెందిన పరిటాల శ్రీరామ్ పై విజయం సాధించారు.
ఇక అందుకే ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని మళ్లీ పరిటాల సునీత బరిలోకి దిగారు. టిడిపి తరఫున ఆమె పోటీ చేస్తూ ఉండగా మరొకవైపు వైఎస్ఆర్సిపి నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు.. అయితే గత అధికారంలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రాప్తాడును అభివృద్ధి పరంగా వృద్ధి చేశారు. మరొకవైపు ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రజలతో మమేకమౌతూ  భారీ ప్రచారాలు కూడా చేశారు.. అయితే ఇదిలా ఉండగా టిడిపి తరఫున పోటీ చేస్తున్న పరిటాల సునీత గతంలో కొన్ని వ్యతిరేకతలు ఎదుర్కొంది..అదేమిటంటే ఈమె తమ్ముళ్లు అధికారం పేరిట ప్రజలను హింసిస్తున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి ..ఈ క్రమంలోనే గత ఎన్నికలలో ఓడిపోయారని సమాచారం.. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తన తోబుట్టువులను సైతం దూరం పెట్టి ప్రజల కోసం మళ్లీ ఎమ్మెల్యేగా పోటీకి దిగారు పరిటాల సునీత. పైగా కంచుకోటగా ఉన్న టిడిపిని వైసిపి కైవసం చేసుకోవడంతో వారిలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.. మరి ఇలాంటి నేపథ్యంలో మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయం అటు పార్టీలలో, ఇటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు.
ఇక చివరిగా కౌంటింగ్ లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయానికి వస్తే.. అనుకున్నట్టుగానే సునీతమ్మ విజయం సాధించింది.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై ఏకంగా 22, 196 ఓట్ల ఆధిక్యంతో పరిటాల సునీతమ్మ విజయం సాధించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: