సేవ చేయడం పవన్ కు వ్యసనం.. ఇలాంటి నేత దొరకడం ఏపీ ప్రజల అదృష్టమే!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. గాజు గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుద్దీ అని ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ లో చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఎదురెదెబ్బలను ఎదుర్కొని ఏపీలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వంగా గీతపై పవన్ కళ్యాణ్ 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అమరావతి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
 
అయితే సేవ చేయడమే పవన్ కు వ్యసనం కావడం గమనార్హం. కోట్ల సంఖ్యలో అభిమానులు పవన్ సినిమాల్లో, రాజకీయాల్లో అభిమానిస్తున్నారంటే ఆదరిస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. సమాజానికి ఏదో చేయాలనే తపన, ఆకాంక్ష పవన్ మాటల్లో, ఆయన సినిమాల్లో, సినిమాల్లోని పాటల్లో కనిపిస్తుంది. లేలే లేలే ఇవ్వాళే లేలే, నారాజ్ కాకుర మా అన్నయ్య, బంగారం సినిమాలోని జై శంభో, ఖుషి సినిమాలో ఏ మే రాజహ సాంగ్స్ వింటే పవన్ ఆలోచనలు ఎంత దూరదృష్టితో ఉంటాయో ఆ పాటల్లో అంతర్లీనంగా ఎంత మంచి సందేశం ఉంటుందో అర్థమవుతుంది.
 
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీ రాజకీయాల్లో సునామీ సృష్టించారనే చెప్పాలి. తను గెలవడంతో పాటు తన అభ్యర్థులను గెలిపించుకుని పవన్ సత్తా చాటారు. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడాల్లేకుండా అన్ని జిల్లాల్లో కూటమి ప్రభంజనం కొనసాగింది. పవన్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏ స్థాయిలో మంచి జరుగుతుందో రాబోయే ఐదేళ్లలో ఏపీ ప్రజలు చూడబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి
 
పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదని శక్తి అని ఏపీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా నమ్మకం పవన్ కళ్యాణ్ అని ఆ నమ్మకాన్ని పవన్ కచ్చితంగా నిలబెట్టుకుంటారని ఏపీ ఓటర్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారని ఏపీ ఓటర్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ స్థాయికి తగ్గ పదవి లభిస్తే ఆయన పవర్ ఏంటో చూపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: