గోపాలపురం : హోం మంత్రినే ఓడించిన మొన‌గాడు టీడీపీ ' మ‌ద్దిపాటి వెంక‌ట్రాజు '

RAMAKRISHNA S.S.
తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గలో ఒకటి గోపాలపురం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటినుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తుంది. 2004 తర్వాత కేవలం 2019 ఎన్నికలలో మాత్రమే ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది. నియోజకవర్గంలో గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలతో పాటు ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకాతిరుమల మండలం కూడా విస్తరించి ఉంది. నియోజకవర్గంలో ఇటు టీడీపీతో పాటు వైసీపీలోను కమ్మ‌ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. తాజా ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ గత ఎన్నికలతో పోలిస్తే మార్పులు జరిగాయి.

విచిత్రం ఏంటంటే 2014, 2019 ఎన్నికలలో ఎక్కడ వైసీపీ, టీడీపీ నుంచి ప్రత్యర్థులుగా ఉన్న తలారి వెంకట్రావు, ముప్పిడి వెంకటేశ్వరరావు ఇద్దరినీ రెండు పార్టీలు ఈసారి అనూహ్యంగా కొవ్వూరు కు బదిలీ చేశాయి. ఇక టీడీపీ అభ్యర్థిగా ప్రోగ్రాం కమిటీ మాజీ చైర్మన్.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. యువకుడు మద్దిపాటి వెంకట్రాజుకు తొలిసారిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుత హోం మంత్రి తానేటి వనితను జగన్ కొవ్వూరు నుంచి గోపాలపురం కు బదిలీ చేశారు. దీంతో వైసీపీ హోంమంత్రి వర్సెస్ టీడీపీ యంగ్ లీడర్ మధ్య గోపాలపురం వేదికగా ఈసారి అదిరిపోయే పోరు జరిగింది.

ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక పోలింగ్ సర్వేను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న గ్రూపులు అన్ని సమ‌స్య పోయి ఏకతాటి మీదకు వచ్చి.. కసితో ప్రచారం చేశాయి. అయితే మనీ మేనేజ్మెంట్‌లో హోంమంత్రి తానేటి వనిత కాస్త ముందంజలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీనికి తోడు వనిత గతంలో 2009లో ఇక్కడ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో.. పాత పరిచయాలు వాడుకొని గట్టి పోటీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న అంచనాల నుంచి గట్టి పోటీ జరిగింది అనే వరకు చివరకు ప్రచారం జరిగింది.

అయితే ఈ రోజు కౌంటింగ్లో వార్ వ‌న్ సైడ్ అయిపోయింది. వెంక‌ట్రాజు హోం మంత్రి తానేటి వనిత‌ను ఏకంగా 26527 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు. హోం మంత్రిని ఓడించిన యంగ్ త‌రంగ్‌గా రికార్డుల్లోకి ఎక్కారు. తొలి ప్ర‌య‌త్నంలోనే అందులోనూ హోం మంత్రిని ఓడించ‌డం అంటే పెద్ద అసాధ్యాన్నే మ‌నోడు సుసాధ్యం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: