విశాఖ - పాడేరు: లీడింగ్లో దూసుకుపోతున్న వైసీపీ?

Purushottham Vinay
విశాఖ - పాడేరు:  విశాఖ పాడేరు రాజకీయాల్లో వారసురాళ్ల హవా సాగుతోంది. 1972లో పాడేరు ఎమ్మెల్యేగా పనిచేసిన గిడ్డి అప్పలనాయుడు కూతురు గిడ్డి ఈశ్వరి... 1985 లో ఎమ్మెల్యేగా పనిచేశారు.1994 లో కొత్తగుల్లి చిట్టినాయుడు కూతురు కొత్తగుల్లి భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేలుగా పనిచేసారు.2014 వ సంవత్సరంలో ఈశ్వరి, 2019 లో భాగ్యలక్ష్మి వైసిపి తరపున పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే వైసిపిని వీడి తెలుగు దేశం పార్టీలో చేరారు గిడ్డి ఈశ్వరి. ఇక ఆ తర్వాత 2019 లో టిడిపి నుండి ఈశ్వరి, వైసిపి నుండి భాగ్యలక్ష్మి పోటీచేసారు...ఆ ఎన్నికల్లో వైసిపి హవా వుండటంతో భాగ్యలక్ష్మి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం భాగ్యలక్ష్మిని అరకు లోక్ సభకు పంపి మత్స్యరస విశ్వేశ్వరరావు అసెంబ్లీకి పోటీ చేయిస్తోంది వైసిపి అధిష్టానం.2019 లో పోటీచేసిన ఈ మహిళలిద్దరికీ ఈసారి మాత్రం అవకాశం దక్కడం లేదు. 


పాడేరు నియోజకవర్గ పరిధిలో జి. మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు, పాడేరు మండలాలు ఉన్నాయి.పాడేరు అసెంబ్లీ ఓటర్ల విషయానికి వస్తే..నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య  - 2,27,117 ఉండగా పురుషులు - 1,10,529 మహిళలు - 1,16,572 ఉన్నారు.పాడేరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థుల విషయానికి వస్తే..వైసిపి అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్ సభ బరిలో నిలిపింది వైసిపి.ఇంకా పాడేరు అసెంబ్లీ బరిలో మత్స్యరాస విశ్వేశ్వరరాజును దింపింది. ఫైనల్ గా పాడేరు నుంచి వైసిపి తరుపున విశ్వేశ్వర రాజు పోటీ చేస్తున్నారు. అలాగే టిడిపి నుంచి గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు. వీరిలో వైసీపీ అభ్యర్థి అయిన విశ్వేశ్వర రాజు 48367 ఓట్లతో ముందంజలో దూసుకుపోతున్నారు. గిడ్డి ఈశ్వరి 33127 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇలా పాడేరు నియోజకవర్గంలో వైసీపీ ఫాస్ట్ గా దూసుకుపోతూ ముందంజలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: