పిఠాపురం : వామ్మో ఏం గెలుపు ప‌వ‌నూ.. ఏం మెజార్టీ... జ‌గ‌న్‌కు ఈ రోజు ఓ కాళ‌రాత్రి..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ... కాకినాడ జిల్లాలోని పిఠాపురం మరో ఎత్తుగా నిలిచింది. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండో నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఆ రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నారు. పిఠాపురం కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా పెట్టని కోటగా ఉంటూ వస్తుంది. ఈ నియోజకవర్గంలో 80 వేల పైచిలుకు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మను పక్కనపెట్టి మరీ.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పైగా కాకినాడ పార్లమెంటుకు కూడా జనసేన పోటీలో ఉంది.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కాకినాడ ఎంపీ వంగా గీత సంచలన విజయం సాధించారు. నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ తో పాటు.. గొల్లప్రోలు నగర పంచాయతీ - పిఠాపురం, యు కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు విస్తరించి ఉన్నాయి. కాపులతో పాటు.. మత్స్యకార, శెట్టి బలిజ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడం బిగ్గెస్ట్ ఎస్సెట్‌.

ఇటు టీడీపీతో పొత్తు నియోజకవర్గంలో బలమైన అనుచరుగడం వల్ల‌ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారం.. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు.. పవన్ గత రెండు ఎన్నికల్లో ఓడిపోయాడు అన్న సానుభూతి ఈసారి బలంగా పనిచేసాయి. నామినేషన్ల పర్వం ప్రచారం, పోలింగ్ సర్వే చూస్తే.. పవన్ గెలుపు పై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. అయితే పవన్ మెజార్టీ ఎంత వస్తుంది అన్న చర్చే ముందు నుంచి నడిచింది.

ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా 70 వేల ఓట్ల భారీ మెజార్టీతో వంగా గీత‌ను ఓడించి స‌గ‌ర్వంగా మెగా, జ‌న‌సేన అభిమానులు త‌లెత్తుకునేలా అసెంబ్లీలోకి అడుగు పెట్ట‌బోతున్నాడు. ప‌వ‌న్‌కు వ‌చ్చిన మెజార్టీ చూసి జ‌గ‌న్‌కు నిజంగానే ఓ కాళ‌రాత్రి అని చెప్పాలి. ఇక మ‌రి ప‌వ‌న్‌కు బాబు డిప్యూటీ సీఎంతో పాటు ఏ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నేదే చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: