చైతూ సమంతల వార్ లో మారిపోతున్న అంచనాలు !

Seetha Sailaja
వినాయకచవితిని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ 13న జరగబోతున్న నాగచైతన్య సమంతల మూవీల ‘వార్’ లో ఎవరు విజేత అన్నవిషయమై ఇప్పుడు ఇండస్ట్రీవర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంతో తన ‘యూటర్న్’ మూవీ పోటీ పడటం సమంతకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఈమూవీల నిర్మాతల పట్టుదల వల్ల తప్పని పరిస్థుతులలో వీరిద్దరి వార్ జరగబోతోంది. 

వాస్తవానికి ‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ విజయం నాగచైతన్య కెరియర్ కు అత్యంత కీలకం. మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈమూవీ సక్సస్ ద్వారా తాను మాస్ హీరోని అని నిరూపించుకోవడానికి చైతూ చాల ప్రయత్నాలు చేసాడు. ఈమూవీ పై పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఉండటంతో ఈమూవీ పై చాలఆశలు పెట్టుకున్నాడు చైతన్య.  

అయితే కన్నడంలో సూపర్ సక్సెస్ అయిన ‘యూటర్న్’ సినిమా పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి. దీనితో ఈఇద్దరి చిత్రాల్లో ఏసినిమా పై చేయి అవుతుంది అన్న అంచనాలకు సంబంధించిన చర్చలు మొదలైపోయాయి. ఈరెండు చిత్రాలు వేరువేరు జోనర్లలో తీయబడినా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఈమధ్య ప్రేక్షకులలో ఆసక్తి పెరగడంతో సమంత చైతన్య పై చేయి సాధించే ఆస్కారం ఉంది అనిఅంటున్నారు. అయితే ఈరెండు సినిమాల ఓపెనింగ్ విషయంలో సమంత మూవీ కాస్త తక్కువగా ఉన్నా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘శైలజా రెడ్డి’ పై పైచేయి సాధించడం ఖచ్చితం అనిఅంటున్నారు. 

దీనికితోడు పక్కా కమర్షియల్ సినిమాగా రొటీన్ కథతో తీయబడ్డ ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినా ఆమూవీకి డివైడ్ టాక్ వస్తే మాత్రం ఈపోటీ వల్ల తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ‘యూటర్న్’ ప్రారంభం నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంటే ఆమూవీకి కనీసం ఓపెనింగ్స్ కూడ రాకుండా చైతన్య ముందు సమంత ఓడిపోయేలా చేస్తుంది అని అంటున్నారు. ఈ అంచనాలు ఇలా ఉంటే వీరిద్దరి మధ్య దూరడమే కాకుండా ఇప్పటికే తన ‘నన్ను దోచుకుందువటే’ మూవీని ప్రమోట్ చేస్తున్న సుధీర్ బాబు సక్సస్ అయితే అది సమంతా చైతూలకు ఊహించని షాక్ అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: