రాజశేఖర్ ‘కల్కి’మోషన్ పోస్టర్ రిలీజ్

siri Madhukar
టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో రాజశేఖర్.  ఆ మద్య ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కెరీర్ కష్టంగా మారి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  అయితే గ‌రుడ వేగ‌తో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చారు రాజ‌శేఖ‌ర్.  కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించిన ఆయన తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇక గరుడ వేగ హిట్ తో రాజశేఖర్ కి వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి. 

ఈ క్రమంలో ‘ఆ!’ సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదివారం చిత్ర టైటిల్‌ను ప్రకటించారు.  ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మోషన్ పోస్టర్‌ చూస్తుంటే సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.  మోషన్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. శివానీ శివాత్మిక మూవీస్ స‌మ‌ర్పణ‌లో హ్యపీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.

ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం అవుతుంది. కాగా, 1983లో తెలంగాణలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ కోణంలో తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్ ‘కల్కి’.  ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న‌ది.. ఈ మూవీకి క‌ల్కీ టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈ మూవీలో హీరోయిన్ గా అంజ‌లిని తీసుకున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: