‘గూఢచారి’బాక్సాఫీస్ కలెక్షన్లు!

siri Madhukar
టాలీవుడ్ లో బలుపు, అమీతుమీ,క్షణం సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అడవి శేషు  హీరోగా శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో రూపొందిన 'గూఢచారి'  మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా థియేటర్లో సందడి చేసింది..కానీ ఆ రోజు నుంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది.


 చిన్న బడ్జెట్టులో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాగా సత్తా చాటుతోంది.  తొలి 2 రోజుల్లో ప్రీమియర్ షోలతో కలిసి రూ. 2 కోట్లకుపైగా వసూలు చేసింది.  గురువారం నాడు ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ద్వారా 52,394 డాలర్లు, శుక్రవారం షోల ద్వారా 1,02,994 డాలర్లు, శనివారం నాటి షోల ద్వారా 1,56,009 డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.  సినిమాకు హిట్ టాక్ రావడమే ఇందుకు కారణమని వెల్లడించారు.  


కేవలం 112 లొకేషన్లలో రెండు రోజుల్లో ఇంత మొత్తం వసూలు చేయడం, సినిమా కథలో వున్న దమ్ముకి నిదర్శనమని ఆయన అన్నారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ కథానాయికగా నటించింది. అడవి శేష్, శోభిత ధూలిపాళ హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గూఢచారి' బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. ముఖ్యంగా యూఎస్ఏలో ఈచిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: