ఆ హీరోయిన్ ని తెగ పొగిడేసింది!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఎప్పుడు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కంగనా రనౌత్  తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. కాకపోతే ఈ సారి మాత్రం కాంట్రవర్సీలతో కాదు..తన సహనటిని తెగ పొగిడేస్తూ..పైకి ఎత్తేసింది.  అలియా నటించిన ‘రాజీ’సినిమాలో తన విశ్వరూపం చూపించిందని..‘రాజీ చిత్రం చాలా బాగా నచ్చింది. మేఘనా గుల్జార్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

ఇక అలియా నటన గురించి మాటల్లో చెప్పలేదు. ఆమె బాలీవుడ్‌లో తిరుగులేని రాణి. ఇది అలియా ప్రపంచం. మనమంతా అందులో భాగం మాత్రమే. కానీ ఇతరుల సినిమాలను నా సినిమాలతో పోల్చుకోను. ఏ సినిమానైనా చూస్తున్నంత సేపు అందులోని నటీనటుల గురించే ఆలోచిస్తాను’అంటూ తెగపొగిడేసింది. గతంలో కంగనా రౌనత్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ఏక్ నిరంజన్’నటించింది. 

ఆ తర్వాత తెలుగు లో ఏ సినిమాలోనూ నటించలేదు.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే తాజాగా కంగనా రనౌత్ మరో బాలీవుడ్ హీరోయిన్‌ అలియాపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: